Share News

కమనీయం.. అగస్త్యేశ్వరస్వామి కల్యాణం

ABN , Publish Date - May 05 , 2025 | 11:46 PM

స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

కమనీయం.. అగస్త్యేశ్వరస్వామి కల్యాణం
గంగాగౌరీ అగస్త్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం గంగాగౌరీ, అగస్త్యేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, ఈవో రామచంద్రాచార్యులు, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:46 PM