Share News

MLA Kalikiri Murali Mohan: ఆటోడ్రైవర్ల భృతిపైనా దుష్ప్రచారం

ABN , Publish Date - Sep 14 , 2025 | 04:10 AM

కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు, యజమానుల అవసరాలను తీరుస్తూ వారి జీవన ప్రమాణాల ను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటే...

MLA Kalikiri Murali Mohan: ఆటోడ్రైవర్ల భృతిపైనా దుష్ప్రచారం

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులు, యజమానుల అవసరాలను తీరుస్తూ వారి జీవన ప్రమాణాల ను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంటే వైసీపీ దానిపైనా దుష్ప్రచారం చేస్తోందని చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. ఉచిత బస్సుతో నష్టం వాటిల్లకుండా ఆటో డ్రైవర్ల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ దసరా నుంచే ప్రభుత్వం వారికి రూ.15 వేలు గౌరవభృతి ఇస్తుందని తెలిపారు. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారిలో కడప జిల్లాకు చెందిన 22 మంది ఉన్నా జగన్‌ కనీసం వారి క్షేమసమాచారాలు తెలుసుకోలేదని, లోకేశ్‌ చొరవతో నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారంతా క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారని అన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 04:10 AM