Kakinada MP Uday Srinivas: ఐటీ సెజ్‌లలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:08 AM
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని అభివృద్ధి చేేస లక్ష్యంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)లో ఐటీ ఉద్యోగులకు...
కేంద్రానికి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని అభివృద్ధి చేేస లక్ష్యంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)లో ఐటీ ఉద్యోగులకు ప్రత్యేకంగా నివాస గృహాల కోసం స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. బుధవారం లోక్ సభలో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఐటీ క్లస్టర్లలో పనిచేసే లక్షలాది మందికి నివాస సమస్య ఎదురవుతోందని తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్ సెజ్‌లలో సమీపంలో నివాస గృహాల నిర్మాణానికి స్పష్టమైన జాతీయ మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.