Share News

Kakani Govardhan Reddy: జైలు నుంచి కాకాణి విడుదల

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:22 AM

మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌పై నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు..

Kakani Govardhan Reddy: జైలు నుంచి కాకాణి విడుదల

నెల్లూరు (క్రైం) ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి బెయిల్‌పై నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బుధవారం విడుదలయ్యారు. కాకాణికి కుటుంబసభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు జైలు బయట స్వాగతం పలికారు. రుస్తుం మైన్స్‌ కేసులో సోమవారం హైకోర్టు అనేక నిబంధనలతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇతర కేసుల్లో అప్పటికే ఆయనకు బెయిల్‌ మంజూరైంది. దీంతో జైలు నుంచి కాకాణి మంగళవారం విడుదలవుతారని అంతా భావించారు. అయితే బెయిల్‌ పత్రాలు సరైన సమయంలో జైలుకు అప్పగించక పోవడంతో బుధవారం వరకు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చాక కాకాణి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినా తనను ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతోనే విడుదల ఆలస్యం చేశారని విమర్శించారు. రానున్న రోజుల్లో అలుపెరుగని పోరాటం చేస్తామని జైలు, అరె్‌స్టలు తమను ఆపలేవని చెప్పారు. అనంతరం కోర్టు నిబంధనల మేరకు నెల్లూరు జిల్లాలో ఉండకుండా విజయవాడకు వెళ్లారు.

Updated Date - Aug 21 , 2025 | 05:22 AM