Share News

KA Paul: నన్ను కిడ్నాప్‌ చేయబోయారు

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:44 AM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

KA Paul: నన్ను కిడ్నాప్‌ చేయబోయారు

  • వెంబడించి.. ఆటోలో ఎక్కించే యత్నం: కేఏ పాల్‌

  • భద్రత కల్పించాలని అమిత్‌ షాకు లేఖ

న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అమిత్‌ షాకు ఆదివారం ఆయన ఒక లేఖ రాశారు. బెట్టింగ్‌ యాప్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్న నేపథ్యంలో తనను కిడ్నాప్‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లోని పార్క్‌ హోటల్‌ ఎదుట అనుమానాస్పదంగా ఉన్న కొందరు తనను వెంబడించారని, ఆటోలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తనకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు.

Updated Date - Aug 04 , 2025 | 04:46 AM