MLA Jyothula Nehru: హిందూమత ద్వేషి జగన్
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:49 AM
దొంగ చేతికి అధికారం ఇస్తే ఏం చేస్తాడనేదానికి పరకామణి కేసు నిదర్శనమని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు....
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దొంగ చేతికి అధికారం ఇస్తే ఏం చేస్తాడనేదానికి పరకామణి కేసు నిదర్శనమని టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘పరకామణి కేసును చిన్న దొంగతనంగా పేర్కొన్న జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఇది హిందువుల మనోభావాలను అవమానించడమే. జగన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మతంపై ఆయనకు ఉన్న ద్వేషాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాను నమ్మే మతం లో ఇలాంటి సంఘటన జరిగితే జగన్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేస్తారా? ఈ కేసులో జగన్‌తోపాటు వైవీ, కరుణాకర్‌రెడ్డిల పాత్ర స్పష్టమవుతోంది. కేసులు తారుమారు చేసేందుకు సాక్షులను హతమార్చడం వైసీపీ వారికి అలవాటే. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన సతీశ్ కుమార్ హత్యకావడం అనుమానాలను రేకెత్తిస్తోంది’ అని నెహ్రూ అన్నారు.