Share News

మోహినీ అలంకరణలో జ్వాలా నృసింహాస్వామి

ABN , Publish Date - May 07 , 2025 | 12:16 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో నృసింహాస్వామి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

మోహినీ అలంకరణలో జ్వాలా నృసింహాస్వామి
ఉత్సవమూర్తుల ఊరేగింపులో అర్చకులు

ఆళ్లగడ్డ, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో నృసింహాస్వామి జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నరసింహా స్వా మి మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామికి ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన స్వామి, మణియర్‌ సౌమ్య నారాయణ్‌ల ఆధ్వర్యంలో అభిషేకాలు, నవ కలశ తిరుమం జనం నిర్వహించారు. అలాగే సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత నర సింహా స్వామిని శరభ వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. వివి ధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైదరా బాద్‌కు చెందిన పరుచూరి వెంకటేశ్వరరావు, వేంపల్లెకు చెందిన బొమ్మి రెడ్డి నారాయణరెడ్డి, విజయవాడకు చెందిన విజయ్‌కుమార్‌ ఉభయ దారులుగా వ్యవహరించారు.

Updated Date - May 07 , 2025 | 12:16 AM