Share News

Justice Sudhanshu Dhulia: ఓఎంసీ అక్రమాలపై జస్టిస్‌ సుధాంశు కమిటీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:01 AM

ఆంధ్ర-కర్ణాటక మధ్య ఉన్న అటవీప్రాంతంలో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) సాగించిన అక్రమ తవ్వకాల నిగ్గుతేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం...

Justice Sudhanshu Dhulia: ఓఎంసీ అక్రమాలపై జస్టిస్‌ సుధాంశు కమిటీ

  • సుప్రీం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర-కర్ణాటక మధ్య ఉన్న అటవీప్రాంతంలో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) సాగించిన అక్రమ తవ్వకాల నిగ్గుతేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధూలియా చైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్‌ విజయానంద్‌ ఉత్తర్వులు(జీవో 167) ఇచ్చా రు. ఇందులో అటవీ, గనులు, సర్వే, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు కేంద్ర సాధికార కమిటీ ప్రతిపాదించిన అధికారి, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతంలో అనంతపురం జిల్లా డీ హీరేహళ్‌ మండలం పరిధిలోని అటవీప్రాంతం వెంట ఉన్న ఇనుప ఖనిజాన్ని ఓఎంసీకి లీజుకిచ్చింది. అయితే లీజు ప్రాంతాన్ని దాటి అటవీ ప్రాంతంలో కూడా ఓఎంసీ అక్రమంగా తవ్వేసింది. వీటిపై సీబీఐ కేసు నమోదుచేసి విచారణ చేసింది. ఓఎంసీకి లీజుకిచ్చిన భూములేమిటి.. అటవీప్రాంతంలో ఏ మేరకు తవ్వకాలు చేశారు.. అక్రమ మైనింగ్‌ ఏ మేరకు జరిగింది.. ఓఎంసీ పాల్పడిన ఇతర అక్రమాలేమిటో గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం గత నెల 19న రాష్ట్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.

Updated Date - Oct 10 , 2025 | 05:01 AM