Share News

Oath Ceremony: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు ప్రమాణం

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:14 AM

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు సమంతో ప్రమాణ స్వీకారం చేశారు.

Oath Ceremony: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు ప్రమాణం

ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభేందు సమంతో ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాల్‌లో సీజే ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు జస్టిస్‌ సుభేందు బదిలీకి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వైవీఎ్‌సబీజీ పార్థసారఽథి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జస్టిస్‌ సుభేందు కుటుంబసభ్యులు, అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చల్లా ధనుంజయ, ఏపీ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ద్వారకానాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారథి, రిజిస్ట్రార్‌లు, హైకోర్టు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

Updated Date - Oct 30 , 2025 | 04:16 AM