Justice Ramakrishna Prasad: లేపాక్షి శిల్పకళ అద్భుతం
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:28 AM
లేపాక్షి ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు...
లేపాక్షి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): లేపాక్షి ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని దుర్గా వీరభద్రస్వామి ఆలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఆలయంలోని ఏడు శిరస్సుల నాగేంద్రుడు, సీతాదేవి పాదం, అర్ధాంతరంగా ఆగిన కల్యాణ మండపం, వేలాడే స్తంభాన్ని జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ దర్శించుకున్నారు. దుర్గా వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏకశిలా నంది విగ్రహాన్ని సందర్శించారు. ఆయన వెంట జిల్లా అదనపు న్యాయాధికారి కంపల్లె శైలజ, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, తహసీల్దారు సౌజన్యలక్ష్మి ఉన్నారు.