Share News

Buddha Prasad: జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలుగు వైభవ పురస్కారం

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:57 AM

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని...

Buddha Prasad: జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలుగు వైభవ పురస్కారం

  • 9న అవనిగడ్డలో ప్రదానం

అవనిగడ్డ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకు మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారాన్ని అందజేయనున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఈ నెల 9న పురస్కారం అందజేసి సత్కరిస్తామన్నారు. తెలుగు భాషా వికాసానికి విశేషంగా కృషిచేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు పురస్కారం అందిస్తున్నామన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 05:00 AM