Blind Cricket Tournament: అంధుల క్రికెట్ పోటీలు ప్రారంభించిన జస్టిస్ కృష్ణమోహన్‌అంధుల క్రికెట్ పోటీలు ప్రారంభించిన జస్టిస్ కృష్ణమోహన్
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:04 AM
అంధులు అవరోధాలను అధిగమిస్తూ, మిగిలిన వారి కంటే తాము తక్కువ కాదని నిరూపించి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ...
గుంటూరు(క్రీడలు), ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): అంధులు అవరోధాలను అధిగమిస్తూ, మిగిలిన వారి కంటే తాము తక్కువ కాదని నిరూపించి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఆకాంక్షించారు. గుంటూరు అరండల్‌పేటలోని పిచ్చుకల గుంట క్రికెట్ మైదానంలో బుధవారం ఆయన అంధుల క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్, విజువల్లి బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్లీ లేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈపోటీలు జరుగుతున్నాయి. గతంలో తిరుపతిలో జరిగిన జోనల్ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన 42 మంది క్రీడాకారులను 3 జట్లుగా విభజించి గుంటూరులో మూడు రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ అంధులు క్రీడల ద్వారా తమ ప్రతిభను వెలుగులోకి తెస్తున్నారన్నారు. అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ క్రికెట్ జట్టుకు ఎంపిక చేస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్ల డైరెక్టర్ పి.ప్రకా్‌షరెడ్డి, ఎల్‌వీఆర్ క్లబ్ సెక్రటరి శ్రీనివాసరెడ్డి, ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శరత్, వీసీఏ ప్రెసిడెంట్ రవీంద్రబాబు, బ్లైండ్ క్రికెట్ జిల్లా ఇన్చార్జ్ కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.