Visakhapatnam: జస్టిస్ చీమలపాటి రవికి పితృ వియోగం
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:18 AM
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి తండ్రి, సీనియర్ న్యాయవాది శ్రీరామమూర్తి (93) సోమవారం విశాఖపట్నం...
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి తండ్రి, సీనియర్ న్యాయవాది శ్రీరామమూర్తి (93) సోమవారం విశాఖపట్నం రామ్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన భీమునిపట్నంలో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుచేసినప్పటి నుంచి (1966) న్యాయవాదిగా పనిచేశారు. 1998 వరకూ న్యాయవాద వృత్తిని కొనసాగించారు. శ్రీరామమూర్తి మరణం తీరని లోటని, ఆయన కొత్తతరం న్యాయవాదులకు మార్గదర్శనం చేసేవారని న్యాయవాదులు సంతాపం వెలిబుచ్చారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.