AP High Court: జస్టిస్ బట్టు దేవానంద్ మళ్లీ ఏపీకి
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:30 AM
జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు వచ్చేందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ...
మద్రాస్ హైకోర్టు నుంచి బదిలీ
రాష్ట్రపతి ఆమోదం..కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మద్రాస్ హైకోర్టు నుంచి తిరిగి ఏపీ హైకోర్టుకు వచ్చేందుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉంది. అదనపు న్యాయమూర్తులతో సహా ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28గా ఉంది. జస్టిస్ దేవానంద్ రాకతో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనుంది. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ బాధ్యతలు చేపట్టారు. 2023 మార్చిలో మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్ నేతృత్వంలో ఈ ఏడాది మే 26న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ దేవానంద్‌ను మద్రాస్ హైకోర్టు నుండి మాతృ హైకోర్టు అయిన ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.