వేసిన తాళాలు వేసినట్టే..!
ABN , Publish Date - May 18 , 2025 | 01:29 AM
స్థానిక బుట్టాయిపేటలోని మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్ తాళాలు శనివారం కూడా తెరుచుకోలేదు.
మచిలీపట్నం టౌన్, మే 17 (ఆం ధ్రజ్యోతి): స్థానిక బుట్టాయిపేటలోని మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్ తాళాలు శనివారం కూడా తెరుచుకోలేదు. ఖాతాదారు దీప్తి 2002లో కుదువపెట్టిన బం గారం మాయమైందంటూ శుక్రవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. బా ధితురాలు శుక్రవారం తాళం వేసి వెళ్లి పోయింది. మేనేజర్ ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. 2002లో ఉన్న మేనేజర్ ఇందుకు బాధ్యుడని ఉన్నతాధికారులకు బంగారం గోల్‌మాల్ అయి న సంగతి ఫిర్యాదు చేశామన్నారు. కా గా శనివారం పలువురు ఖాతాదారులు బాకీ చెల్లించేందుకు వచ్చి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో మేనేజర్ విధులకు ఆటంకం కలిగిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం బాకీ తీ ర్చినప్పటికీ తన బంగారం తిరిగి ఇవ్వలేదంటూ బాధితురాలు దీప్తి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుటకు ఈ సమస్యను తీసుకుని వెళ్లేందుకు దీప్తి మేనేజర్ ప్రయత్నాలు చేస్తున్నారు.