Judicial Verdict: కోర్టు ప్రాంగణం శుభ్రం చేయండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:29 AM
బాపట్ల జిల్లా చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని గురువారం వినూత్న తీర్పు చెప్పారు.
మందుబాబులకు న్యాయాధికారి వినూత్న తీర్పు
చీరాల, జూలై31(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల జూనియర్ సివిల్ జడ్జి కాత్యాయని గురువారం వినూత్న తీర్పు చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 10 మందికి తొలుత జైలు శిక్ష, జరిమానా విధించారు. అయితే వారి అభ్యర్థన మేరకు కమ్యూనిటీ సర్వీసె్‌సలో భాగంగా మూడు రోజులు కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని, చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.