రైతుల్లో ఆనందోత్సవం..!
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:58 PM
కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుభీభవ - పీఎం కిసాన’ సాయం ఏడు వేల రూపాయలు బుధవారం జమ చేసింది.
ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ జమ
2.72 లక్షల మంది రైతులకు రూ.181.36 కోట్లు
కష్టకాలంలో ఆర్థిక భరోసా
కర్నూలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుభీభవ - పీఎం కిసాన’ సాయం ఏడు వేల రూపాయలు బుధవారం జమ చేసింది. సెల్‌ఫోన్లకు వచ్చిన సంక్షిప్త సమాచారం చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రకృతి సహకరించకపోవడంతో పంటలన్నీ నాశనం అయ్యాయి. దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సమయంలో అండగా మేమున్నాం అంటూ సీఎం చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నదాత సుభీభవ - పీఎం కిసాన పథకం కింద ఆర్థిక భరోసా ఇవ్వడం రైతులకు ఊరటనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన పథకం కింద రూ.2 వేలు కలిపి రూ.7 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలో 2,72,757 మంది రైతులకు రూ.181.36 కోట్లు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. అన్నదాతలను కదిపితే ఆనందంతో పులకరించిపోతున్నారు. ‘అధిక వర్షాలు, ధరలు పతనమై తీవ్రంగా నష్టపోయాం.. అప్పులు తీర్చేందుకు వలసలు వెళ్తున్నాం.. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏడు వేలు జమ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. రబీ సాగు పెట్టుబడికి ఎంతో ఊరట లభించింది..’ అని కోసిగి మండలం డి.బెళగల్ గ్రామానికి చెందిన రైతు ఉరుకుందు ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం కర్నూలు రూరల్ మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిలు ప్రారంభించారు. కోడుమూరు నియోజకవర్గంలోని 35,052 మంది రైతులకు రూ.23.06 కోట్లు మెగా చెక్కును రైతులకు అందజేశారు.
ఫ కష్టకాలంలో భరోసా
జిల్లాలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన సాయం మెగా చెక్కులను ఎమ్మెల్యేలు, అధికారులు రైతులకు అందజేశారు. ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 38,318 మంది రైతులకు రూ.26.04 కోట్ల చెక్కును ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన మల్లయ్య, వైస్ చైర్మన బి.అంజి, ఏడీఏ మహ్మద్‌ఖాద్రీలు అందజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో 54,774 మంది రైతులకు రూ.37.17 కోట్లు తుగ్గలి మండలం ఎర్రగుడిలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పంపిణీ చేశారు. శాలివాహన కార్పొరేషన మాజీ చైర్మన తుగ్గలి నాగేంద్ర పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గంలో 20,287 మంది రైతులకు రూ.13.36 కోట్లు మెగా చెక్కును ఓర్వకల్లులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత అందజేశారు. టీటీడీ బోర్డు డైరెక్టర్ మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంలో 18,722 మంది రైతులకు రూ.12.32 కోట్ల మెగా చెక్కును పెద్దతుంబళం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్, ఏపీ సీడ్స్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, ఏపీ కురబ కార్పొరేషన చైర్మన మాన్వి దేవేంద్రప్ప, టీడీపీ నాయకుడు కె.ఉమాపతినాయుడు తదితరులు అందజేశారు. ఆలూరు నియోజకవర్గానికి చెందిన 63,317 మంది రైతులకు రూ.42.08 కోట్ల మెగా చెక్కును ఆలూరులో టీడీపీ ఇనచార్జి వైకుంఠం జ్యోతి, వ్యవసాయ శాఖ ఏడీ చెంగల్‌రాయుడు, ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన బిల్లెకల్లు వెంకటేశ అందజేశారు. మంత్రాలయం నియోజకవర్గంలో 41,992 మంది రైతులకు రూ.27.61 కోట్లు మండల కేంద్రం కౌతాళంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. కర్నూలు నియోజకవర్గంలో 295 మంది రైతులకు రూ.18 లక్షల చెక్కును జొహరాపురంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు అందజేశారు. అత్యధికంగా ఆలూరు నియోజకవర్గం రైతులు రూ.42.08 కోట్లు ఆర్థిక ప్రయోజనం పొందడం విశేషం.
ఫ నియోజకవర్గాల వారిగా రైతులు అందుకున్న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన సాయం (రూ.కోట్లల్లో):
-----------------------------------------------------------------
నియోజకవర్గం రైతులు అన్నదాత పీఎం మొత్తం
సుఖీభవ కిసాన
----------------------------------------------------------------------
కర్నూలు 295 0.15 0.03 0.18
కోడుమూరు 35,052 17.52 5.48 23.00
ఎమ్మిగనూరు 38,318 19.16 6.88 26.04
ఆదోని 18,722 9.36 2.96 12.32
మంత్రాలయం 41,992 20.99 6.62 27.61
పత్తికొండ 54,774 27.38 9.79 37.17
ఆలూరు 63,317 31.65 10.43 42.08
పాణ్యం 20,287 10.14 3.22 13.36
-------------------------------------------------------------------
మొత్తం 2,72,757 138.38 45.12 181.36
----------------------------------------------------------------------
రైతులకు అండగా ప్రభుత్వం : కలెక్టర్
కర్నూలు రూరల్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో బుధవారం జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన రెండవ విడత కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ఆదుకుంటామన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్ పధకాలన్ని దశల వారిగా కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. అనంతరం రైతులకు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ, ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, ఎల్‌డీఎం రామచంద్రరావు, ఏడి,సాలురెడ్డి, తహసీల్దార్ రమేష్‌బాబు, సర్పంచు మహానంది, తాండ్రపాడు సర్పంచు జయన్న, టీడీపీ మండల కన్వీనర్ బుర్ర వెంకటేష్‌నాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రామాంజనేయులు, రైతులు పాల్గొన్నారు.