Speaker Ayyna Patrudu: ప్రజాసమస్యల పరిష్కారంలో జాయింట్ కమిటీలదే కీలకపాత్ర
ABN , Publish Date - Sep 28 , 2025 | 05:28 AM
ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో అసెంబ్లీ జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో అసెంబ్లీ జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శనివారం స్పీకర్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆధ్వర్యంలో 8 జాయింట్ కమిటీలు తొలిసారి సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సభ్యులు జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోనూ పర్య టించాలని కోరారు. సభా సమావేశాలు ఏడాది పొడవునా జరపటం సాధ్యం కాని పనికావడంతో, ఈ కమిటీలు సభ పని భారాన్ని పంచుకుంటాయని, ఏడాది పొడవునా పనిచేస్తాయని అన్నారు. ‘మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగు లు వంటి వర్గాల సంక్షేమానికి మనం తీసుకునే చర్యలు నైతిక బాధ్యత మాత్రమే కాదు.. రాజ్యాంగబద్ధమైన విధి’ అని స్పీకర్ పేర్కొన్నారు.