Excise Department: కల్లు, నీరా, ఎక్సైజ్ అకాడమీకి జేసీ నియామకం
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:16 AM
ఎక్సైజ్ శాఖలో గతంలో ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని సబ్జెక్టులను కలిపి ఓ పోస్టు సృష్టించి... దానికి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించారు. ఎక్సైజ్ శాఖలో మూడు జాయింట్ కమిషనర్ పోస్టులు ఉంటాయి.
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఎక్సైజ్ శాఖలో గతంలో ఎప్పుడూ ఎవరికీ ఇవ్వని సబ్జెక్టులను కలిపి ఓ పోస్టు సృష్టించి... దానికి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించారు. ఎక్సైజ్ శాఖలో మూడు జాయింట్ కమిషనర్ పోస్టులు ఉంటాయి. అందులో రెండు కమిషనరేట్‌లో ఉంటే, ఒకటి బేవరేజెస్ కార్పొరేషన్‌లో ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయింట్ కమిషనర్ నాగలక్ష్మిని డిస్టిలరీస్ విభాగానికి జేసీగా నియమించారు. ఆ తర్వాత కొన్ని నెలలకు అకస్మాత్తుగా ఆమెను తొలగించారు. దాదాపు మూడు నెలల తర్వాత ఆమెకు పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే... కల్లు, నీరా, ఎక్సైజ్ అకాడమీ, కొత్తగా వచ్చే ఉద్యోగులకు శిక్షణ కరిక్యులమ్ తయారీ, వారికి శిక్షణ ఇవ్వడంలాంటి సబ్జెక్టులతో జేసీ పోస్టు రూపొందించి... దానిని నాగలక్ష్మికి అప్పగించారు.