Pending Incentives: రాయుతీ బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:36 AM
ఎన్నో ఏళ్లుగా తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీ బకాయులను ఈనెలాఖరుకల్లా 100 శాతం విడుదల చేయాలని, లేకుంటే నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే...
లేదంటే భాగస్వామ్య సదస్సు బహిష్కరణ
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నోటీసు
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీ బకాయులను ఈనెలాఖరుకల్లా 100 శాతం విడుదల చేయాలని, లేకుంటే నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును బహిష్కరిస్తామని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈమేరకు జేఏసీ ప్రతినిధులు అనార్‌బాబు, రాజశేఖర్, సత్యానందరావు, త్రిమూర్తులు, విజయ్ సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ శుభం బన్సాల్, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. రాయితీలు ఇవ్వకపోతే సదస్సు వద్ద నిరాహార దీక్షలు చేపడతామన్నారు. జేఏసీ డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళతామని బన్సాల్ హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో జేఏసీ నాయకుడు భక్తవత్సలం బృందం ఆ జిల్లా కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.