TDP MLAs: అవినీతి, అక్రమాలకు ప్రతిరూపం జోగి
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:36 AM
అవినీతి, అక్రమాలకు నిలువెత్తు రూపం వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అని ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు కాగిత, యార్లగడ్డ ధ్వజం
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు నిలువెత్తు రూపం వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ అని ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వీరు విలేకరులతో మాట్లాడారు. జోగి పేరు చెబితేనే పెడన నియోజకవర్గ ప్రజలు వణికిపోతారని కృష్ణ ప్రసాద్ అన్నారు. నకిలీ సారా, నకిలీ మద్యం ఇవన్నీ ఆయనకు ముందునుంచీ అలవాటైన పనులేనన్నారు. నకిలీ మద్యం కేసులో జోగికి జైలు ఖాయమని చెప్పారు. తప్పు చేసిన ప్రతిసారీ కులంకార్డును తీయడం ఆయనకు అలవాటేన అన్నారు. జోగి రమేశ్‌ను, పేర్ని నానిని సమాజ బహిష్కరణ చేయాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.