Vijayawada: దుర్గగుడిలో జోగి అత్యుత్సాహం
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:26 AM
దుర్గగుడి ప్రాంగణంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనకు నకిలీ మద్యం కేసు లో ఎటువంటి సంబంధం లేదని...
నకిలీ మద్యం కేసుతో సంబంధం లేదంటూ అమ్మవారి మీద ప్రమాణం... భక్తుల ఆగ్రహం
విజయవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దుర్గగుడి ప్రాంగణంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనకు నకిలీ మద్యం కేసు లో ఎటువంటి సంబంధం లేదని ఆయన కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేశారు. సోమవారం కనక దుర్గమ్మను జోగి రమేశ్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. టోల్‌గేట్ సమీపంలో ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద దీపం వెలిగించిన జోగి... ‘నకిలీ మద్యం కేసులో నా ప్రమేయం లేదు. నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. వారికి మంచి బుద్ధి ప్రసాదించాలి’ అని ప్రమాణం చేశారు. జోగి రమేశ్ వ్యవహార శైలి పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవస్థానం ప్రాంగణంలో రాజకీయాలా..?
పవిత్రమైన కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఉపన్యాసాలు, ఆరోపణలు చేయరాదని దేవస్ధానం పాలకమండలి పేర్కొంది. దుర్గగుడి ఆలయ ప్రాంగణంలోని ఘాట్ రోడ్డు, కామధేను అమ్మవారి ఆలయం, మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాలలో ఎటువంటి రాజకీయ అంశాలకు తావులేదని పాలకమండలి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.