Budda Venkanna: జోగి రమేశ్ అరెస్టు ఖాయం
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:04 AM
నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ అరెస్టు కావటం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
నకిలీ మద్యం కేసులో ఆయనే సూత్రధారి: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ అరెస్టు కావటం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ నకి లీ మద్యం తయారీలో జోగి రమేశ్ సూత్రధారుడని చెప్పారు. జోగి రమేశ్ నకిలీ మద్యం తయారు చేయించారని జనార్దన్‌రావు ఒప్పుకొన్నారని తెలిపారు. జోగి రమేశ్ వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని, బెదిరించి అగ్రిగోల్డ్ ఆస్తులను రాయించుకున్నారని పేర్కొన్నారు. కావాలనే చంద్రబాబు నివాసంపై దాడికి జోగి రమేశ్ వచ్చారని తెలిపారు. మాజీ సీఎం హోదాలో ఉన్న నాయకుడి ఇంటికి నిరసన తెలపటానికి ఎలా వెళతారని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లవచ్చా అని నిలదీశారు. అమరావతి పై వైసీపీ స్టాండ్ మారినంతమాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. జోగి రమేశ్‌కు దమ్మూలేదు, దుమ్ములేవని ఎద్దేవా చేశారు.