Share News

SIT Custody: సిట్‌ కస్టడీకి జోగి బ్రదర్స్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:45 AM

కిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు రామును సిట్‌ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది.

SIT Custody: సిట్‌ కస్టడీకి జోగి బ్రదర్స్‌

  • నకిలీ మద్యం నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

విజయవాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు రామును సిట్‌ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. ప్రస్తుతం వారిద్దరూ నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో విచారించేందుకు వారిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ పోలీసులు కోరగా.. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావుతోపాటు మాజీ మంత్రి జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాము, సయ్యద్‌ హాజి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, మిథున్‌దాస్‌, అంతాదా్‌సలను మంగళవారం పోలీసులు విజయవాడలోని ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న అద్దేపల్లి జగన్మోహనరావును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరిచారు. దీంతో వారికి వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయాధికారి జి.లెనిన్‌బాబు ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Nov 26 , 2025 | 06:46 AM