Share News

కర్నూలు జీజీహెచ్ లో ఉద్యోగాలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:56 AM

కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న 43 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు జీజీహెచ్ లో ఉద్యోగాలు

43 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు నోటిఫికేషన

కర్నూలు హాస్పిటల్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న 43 కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఏడాది పాటు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉండే ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషనను విడుదల చేశామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తులను డౌనలోడ్‌ చేసుకుని ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మద్య (ఈ నెల 13న సెలవు దినం మినహా) ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఫిజియోథెరపిస్టు-2, స్పీచ థెరపిస్టు-2, సి.ఆర్మ్‌ టెక్నీషియన-2, ఓటీ అసిస్టెంట్లు-2, ఈసీజీ టెక్నీషియనలు-2, డయాలసిస్‌ టెక్నీషియన్స-2, ఆడియోమెట్రి టెక్నీషియనలు-1, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల్లో జనరల్‌ డ్యూటీ అటెండర్‌-8, ఎంఎనవోలు-11, ఎఫ్‌ఎంవోలు 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 07:40 AM