Share News

Job Opportunities in Germany: జర్మనీలో ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 05:31 AM

రాష్ట్రంలోని యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం డెక్రా గ్రూప్‌తో..

Job Opportunities in Germany: జర్మనీలో ఉపాధి అవకాశాలు

డెక్రా గ్రూప్‌తో ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఒప్పందం

అమరావతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని యువతకు జర్మనీలో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం డెక్రా గ్రూప్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 25 సంవత్సరాలకు పైగా అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా 3వేల కంపెనీలకు సేవలందిస్తున్న డెక్రా ఆర్బిట్‌ భాగస్వామ్య సంస్థ ద్వారా వివిధ రంగాలకు చెందిన నిపుణులను జర్మనీకి పంపించడానికి శిక్షణ, రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమాలను చేపడతామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో గణేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి శాఖకార్యదర్శి కోన శశిధర్‌, డెక్రా ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఎండీ య్వోన్‌ బొలాచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 05:31 AM