Share News

జేఈఈ- ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:38 PM

జేఈఈ-అడ్వాన్సడ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.

  జేఈఈ- ఫలితాలు విడుదల

ఆలిండియా స్థాయిలో కే. జీవన కుమార్‌ 889వ ర్యాంకర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన 2 (ఆంధ్రజ్యోతి): జేఈఈ-అడ్వాన్సడ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన కే. జీవన కుమార్‌కు ఆలిండియా స్థాయిలో 889వ ర్యాంకు, టి. మిధున సాయి కుమార్‌కు 6015వ ర్యాంకు వచ్చాయి. ఎస్టీ కేటగిరిలో వినుకొండ నవదీప్‌ 646వ ర్యాంకు సాధించి అగ్రభాగంలో నిలిచాడు. జేఈఈ- అడ్వాన్సడ్‌ పరీక్ష మే 18వ తేదీన జరిగింది. కర్నూలు జిల్లాలో 7,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎనఐటీ విద్యాసంస్థల్లో బిటెక్‌ కోర్సుల్లో అడ్మిషన పొందుతారు.

Updated Date - Jun 02 , 2025 | 11:38 PM