Lokam Prasadu: నాపై వ్యతిరేక వార్తలు రాస్తే తాటతీస్తా
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:01 AM
నాపై కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు వస్తున్నాయి. ఇకపై ఎవరైనా వెధవ వేషాలు వేసినా.. నాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా తాటతీస్తా’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే...
విలేకరులపై నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే భర్త చిందులు
విజయనగరం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘నాపై కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు వస్తున్నాయి. ఇకపై ఎవరైనా వెధవ వేషాలు వేసినా.. నాకు వ్యతిరేకంగా వార్తలు రాసినా తాటతీస్తా’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి భర్త లోకం ప్రసాదు విలేకరులను హెచ్చరించారు. భోగాపురంలోని జనసేన ఆఫీసులో ఆదివారం ఎమ్మెల్యే తన తన భర్త, పార్టీ నేతలతో కలిసి సమావేశం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలేకరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతలోనే ఆమె భర్త ప్రసాదు ఆవేశంతో ఊగిపోతూ.. కొన్ని పత్రికలు తనపై అసత్య కథనాలు రాస్తున్నాయని, ఇకపై అలాంటి వారి తాటతీస్తానని హెచ్చరించారు. ‘నేను చాలా మొండివాడిని. నన్ను ఎవరూ ఏమీ పీకలేరు. నేను ఎవరికీ భయపడేదిలేదు. ఎమ్మెల్యే భర్తకు హక్కులు ఉండవా? ఇకపై తడాఖా చూపిస్తా’ అన్నారు.