Janasena Activist: తాను లేకున్నా ఐదుగురికి పునర్జన్మ
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:15 AM
తాను మరణించి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన ఓ జనసేన కార్యకర్త ఉదంతమిది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచనతో అతని తల్లిదండ్రులు ఓ బాలుడికి...
రోడ్డు ప్రమాదంలో జనసేన కార్యకర్త మృతి
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచనతో అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు
రాజమహేంద్రవరం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తాను మరణించి ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన ఓ జనసేన కార్యకర్త ఉదంతమిది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సూచనతో అతని తల్లిదండ్రులు ఓ బాలుడికి గుండె ఇచ్చి ప్రాణం పోయడంతో పాటు, ఇతర అవయవాలు దానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆవలోని వాంబే గృహాల్లో నివసించే పీతా విజయకృష్ణ(28) జనసేన కార్యకర్త. అతని తండ్రి శ్రీనివాస్ లారీ డ్రైవర్. తల్లి సుబ్బలక్ష్మి పక్షవాతంతో బాధపడుతోంది. ఈ నెల 6న రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విజయకృష్ణ పరిస్థితి విషమించడంతో గుంటూరు కిమ్స్‌కు తరలించారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అని శనివారం ధ్రువీకరించడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి అవయవ దానం చేసేలా అతని తల్లిదండ్రులతో మాట్లాడే బాధ్యతను రాజమండ్రి జనసేన ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణకు అప్పగించారు. ఈ మేరకు ఆయన విజయకృష్ణ తల్లిదండ్రులను ఒప్పించారు.