Share News

Minister Nandendla Manohar: 30న విశాఖలో జనసేన సభ

ABN , Publish Date - Aug 20 , 2025 | 05:39 AM

విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Minister Nandendla Manohar: 30న విశాఖలో జనసేన సభ

  • వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల

విశాఖపట్నం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈనెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఈ సమావేశం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో జరుగుతుందన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వివరించారు. విశాఖపట్నం పబ్లిక్‌ ల్రైబరీలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్ల కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామ స్థాయి కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. విశాఖ వన్‌టౌన్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 30వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ.. విశాఖ ఉక్కును కాపాడాలని అమిత్‌ షాను కూటమి ఏర్పాటు కాకముందే పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో కలిసి కోరారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం డిమాండ్‌ వల్లే ఇటీవల స్టీల్‌ ప్లాంటుకు కేంద్రం ఆర్థిక సాయం అందించిందని వివరించారు.

Updated Date - Aug 20 , 2025 | 05:40 AM