Jana Sena Colors Adorn Road: డివైడరుకు జనసేన రంగులు
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:09 AM
జగన్ హయాంలో అది గుడైనా, బడైనా ఆఖరికి ప్రభుత్వ కార్యాలయం అయినా వైసీపీ రంగు పడక తప్పేది కాదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం...
జగన్ హయాంలో అది గుడైనా, బడైనా ఆఖరికి ప్రభుత్వ కార్యాలయం అయినా వైసీపీ రంగు పడక తప్పేది కాదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ తీరును తప్పుపట్టేవారు. అయితే, ఇప్పుడు జనసేన కార్యకర్తలు అత్యుత్సాహంతో చేసిన పని మరోసారి నాటి వైసీపీ రంగుల గోలను గుర్తుకు తెచ్చింది. గుంటూరు రూరల్ మండలంలోని వెంగళాయపాలెంలో దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాన్ని స్థానిక జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేశారు. రంగా తనయుడు వంగవీటి రాఽధా ఈ నెల 26 వ తేదీన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రోడ్‌లోని డివైడర్‌కు మంగళవారం జనసేన రంగులు వేసి కార్యకర్తలు హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన కార్యకర్తల చర్యను నెటిజన్లతో పాటు గ్రామస్థులు కూడా తప్పుబడుతున్నారు.
- గుంటూరు, ఆంధ్రజ్యోతి