హోంగార్డుపై జనసేన కార్యకర్తదాడి
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:33 AM
నైట్‌బీట్‌లో ఉన్న హోంగార్డుపై దాడి చేసిన జనసేన కార్యకర్త కర్రి మహేష్‌పై మచిలీపట్నం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి కానిస్టేబుల్ బాషా, హోంగార్డు మోహనరావు నైట్‌బీట్ డ్యూటీ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో బీట్ పుస్తకంలో సంతకం చేసేందుకు ఒక ఇంటి వద్ద నిలబడి ఉన్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన విశ్వబ్రాహ్మణకాలనీ జనసేన ఇన్‌చార్జి కర్రి మహేష్ వారిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు. నైట్‌బీట్ డ్యూటీలో ఉన్నామని కానిస్టేబుల్ చెప్పగా, వారితో మహేష్ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హోంగార్డు ముఖంపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు,
-మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలింపు
- నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ
మచిలీపట్నం/మచిలీపట్నం టౌన్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): నైట్‌బీట్‌లో ఉన్న హోంగార్డుపై దాడి చేసిన జనసేన కార్యకర్త కర్రి మహేష్‌పై మచిలీపట్నం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆదివారం రాత్రి కానిస్టేబుల్ బాషా, హోంగార్డు మోహనరావు నైట్‌బీట్ డ్యూటీ చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో బీట్ పుస్తకంలో సంతకం చేసేందుకు ఒక ఇంటి వద్ద నిలబడి ఉన్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన విశ్వబ్రాహ్మణకాలనీ జనసేన ఇన్‌చార్జి కర్రి మహేష్ వారిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు. నైట్‌బీట్ డ్యూటీలో ఉన్నామని కానిస్టేబుల్ చెప్పగా, వారితో మహేష్ వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా హోంగార్డు ముఖంపై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు, అడ్డువచ్చిన కానిస్టేబుల్‌ను పరుష పదజాలంతో దూషించాడు. గాయపడిన హోంగార్డును వెంటనే మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితుడైన హోంగార్డు మోహనరావు ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లో కర్రి మహేష్‌పై 121(1), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇటీవల మచిలీపట్నంలోని పోలీస్‌స్టేషన్‌లలో విధుల్లో చేరిన ఇద్దరు మహిళా ఎస్‌ఐల పట్ల కూడా కర్రి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు పోలీస్ అధికారులు అంటున్నారు. తరచూ వివాదాలకు కారణమవుతూ జనసేనకు తలవంపులు తెస్తున్న కర్రి మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, అతని పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తుస్తున్నట్లు జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు.