Share News

Tirupati: ఎస్వీ జూపార్కులో జాగ్వార్‌ కుశ మృతి

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:07 AM

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో కుశ అనే మగ జాగ్వార్‌ మంగళవారం మృతి చెందినట్లు జూక్యూరేటర్‌ సెల్వం తెలిపారు. కుశను 2019లో హైదరాబాద్‌ నెహ్రూ...

Tirupati: ఎస్వీ జూపార్కులో జాగ్వార్‌ కుశ మృతి

మంగళం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో కుశ అనే మగ జాగ్వార్‌ మంగళవారం మృతి చెందినట్లు జూక్యూరేటర్‌ సెల్వం తెలిపారు. ‘కుశను 2019లో హైదరాబాద్‌ నెహ్రూ జులాజికల్‌ పార్కు నుంచి తీసుకొచ్చాం. దీని వయసు 15 సంవత్సరాల మూడు నెలలు. ఎప్పటిలాగే ఆవరణలోకి ఈ జాగ్వార్‌ను పెట్టగా ఒక చెట్టుకు చిక్కుకొని చనిపోయి కనిపించింది’ అని ఆయన వివరించారు. కుశ మృతికి హైపర్‌ వాల్మీక్‌ షాక్‌, ఆస్పీజియా కారణమని ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయంలోని పాథాలజిస్టులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 05:07 AM