మళ్లీ పాదయాత్ర హాస్యాస్పదం: బీసీ జనార్దన్‌రెడ్డి
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:18 AM
దేశంలో ఏ పార్టీకి లేనంత వ్యతిరేకత వైసీపీకి రాష్ట్రంలో ఉంది. అలాంటి పార్టీకి అధ్యక్షుడైన జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
జమ్మలమడుగు, జూలై 7(ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ఏ పార్టీకి లేనంత వ్యతిరేకత వైసీపీకి రాష్ట్రంలో ఉంది. అలాంటి పార్టీకి అధ్యక్షుడైన జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది’ అని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట, కన్నెలూరు గ్రామాల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ చేతకాని పాలనతో 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పి 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుందన్నారు.