Share News

పరామర్శకు దండుపాళ్యం బ్యాచ్‌: సప్తగిరి ప్రసాద్‌

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:15 AM

మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్‌ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ విమర్శించారు.

పరామర్శకు దండుపాళ్యం బ్యాచ్‌: సప్తగిరి ప్రసాద్‌

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి):మామిడిలో ఎన్ని రకాలు ఉంటాయో కూడా తెలియని జగన్‌ మామిడి రైతుల పరామర్శకు వెళ్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ విమర్శించారు. ‘చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించేందుకు 9న దండుపాళ్యం బ్యాచ్‌ బయలుదేరుతోంది. వెయ్యి ఎలుకల్ని తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్లు జగన్‌ పరామర్శ యాత్ర ఉంది. ఈ పరామర్శకు రైతు ద్రోహి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటేసుకుని రావడం దారుణం’ అని ప్రసాద్‌ అన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 05:16 AM