జగన్ నీ సినిమా అయిపోయింది: ఉండవల్లి శ్రీదేవి
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:22 AM
తండ్రి చావును అడ్డుపెట్టుకుని, ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి సినిమా అయిపోయిందని మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు.
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): తండ్రి చావును అడ్డుపెట్టుకుని, ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్‌రెడ్డి సినిమా అయిపోయిందని మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిన జగన్‌కు దళితుల ఉసురు తగిలిందన్నారు. అందుకే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కొట్టుకుపోయాడన్నారు. చివరకు జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రోజా కూడా దళితులతో ఫొటోలు దిగేందుకు వివక్ష చూపడం దారుణమని శ్రేదేవి అన్నారు.