Share News

తొందరలో జగన్‌ జైలుకెళ్లడం ఖాయం: నల్లమిల్లి

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:54 AM

రాష్ట్రంలో లిక్కర్‌ కుంభకోణం మూలాలు కదులుతున్నాయని, ఈ కేసులో తొందరలోనే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు

తొందరలో జగన్‌ జైలుకెళ్లడం ఖాయం: నల్లమిల్లి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లిక్కర్‌ కుంభకోణం మూలాలు కదులుతున్నాయని, ఈ కేసులో తొందరలోనే వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని లిక్కర్‌ కుంభకోణం అవినీతికి మోడల్‌గా నిలిచిపోయిందని, అవినీతికి జగన్మోహన్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని దేశ, విదేశాల్లో మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ మునిగిపోయే నావగా పేర్కొన్నారు. ఈ నైరాశ్యం నుంచి బయటపడేందుకే జగన్మోహన్‌రెడ్డి పరామర్శల పేరుతో దండయాత్రలు సాగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాడని ఆక్షేపించారు.

Updated Date - Aug 09 , 2025 | 04:54 AM