Share News

జగన్‌ జైలుకెళ్లక తప్పదు: దినకర్‌

ABN , Publish Date - Dec 19 , 2025 | 04:47 AM

జగన్‌ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. భవిష్యత్‌లో కూడా జైలుకు వెళ్లక తప్పదు. ఆయన తప్పులకు పడే శిక్షవల్ల ఎన్నికల్లో పోటీ చేయలేకపోవచ్చు అని 20 సూత్రాల కార్యక్రమాల...

జగన్‌ జైలుకెళ్లక తప్పదు: దినకర్‌

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారు. భవిష్యత్‌లో కూడా జైలుకు వెళ్లక తప్పదు. ఆయన తప్పులకు పడే శిక్షవల్ల ఎన్నికల్లో పోటీ చేయలేకపోవచ్చు’ అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తాను జైలుకు వెళ్లడంతో.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జైలులో ఉండాలనే మానసిక స్థితికి జగన్‌ చేరుకున్నారు. ఆయన పాలనలో ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు పీపీపీ విధానంలో పని చేస్తే ఆ సేవలు ప్రభుత్వం చేసినట్లు చెప్పారా? లేక ప్రైవేటు సేవలని చెప్పారా? ఆయన సీఎంగా పని చేయడం రాష్ట్రం దౌర్భాగ్యం. పీపీపీ అంశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దగ్గరకు వెళ్లిన వైసీపీ ఎంపీలు ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక పరువు పొగొట్టుకున్నారు’ అని ఎద్దేవా చేశారు.

Updated Date - Dec 19 , 2025 | 04:47 AM