Makavarapalem: ఇవి చూడటానికే జగన్ రాక
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:40 AM
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిరసిస్తూ... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం అనకాపల్లి జిల్లా...
మాకవరపాలెంలో ‘మెడికల్ కాలేజీ’
వైసీపీ హయాంలోనే నిలిచిపోయిన పనులు
ఇంటర్నెట్ డెస్క్: పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నిరసిస్తూ... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వస్తున్నారు. అక్కడికి వచ్చి చూసేది పై ఫొటోల్లోని భవనాలనే! ఈ మెడికల్ కాలేజీ అంచనా వ్యయం రూ.356.37 కోట్లు. 2023 జనవరి 25వ తేదీన పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ.20.23 కోట్ల విలువైన పనులు చేయగా... 11.25 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. దీంతో... కాంట్రాక్టు సంస్థ 2023 డిసెంబరులోనే పనులను నిలిపివేసింది. అంటే... జగన్ తన హయాంలో పనులు ఆగిపోయిన మెడికల్ కాలేజీ బిల్డింగులను తానే వచ్చి చూస్తారన్న మాట!
- మాకవరపాలెం, ఆంధ్రజ్యోతి