Jagan to Meet Mithun Reddy: 25న మిథున్‌రెడ్డితో జగన్ ములాఖత్
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:02 AM
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 25న రాజమహేంద్రవరం రానున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఏ..
రాజమహేంద్రవరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ 25న రాజమహేంద్రవరం రానున్నారు. లిక్కర్ స్కామ్‌లో ఏ 4 నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో ఆయన ములాఖత్ కానున్నారు. ఈ విషయాన్ని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మంగళవారం ఆయన పార్టీ నాయకులు దాడిశెట్టి రాజా, వంగా గీతతో కలసి మిథున్‌రెడ్డిని ములాఖత్‌లో కలిశారు.