YSR Congress Party: నేడు సమన్వయకర్తలతో జగన్ భేటీ
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:21 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సమావేశం కానున్నారు. భేటీలో 175 అసెంబ్లీ.. 25 లోక్‌సభ...
ప్రభుత్వంపై సోషల్ మీడియా ప్రయోగంపై నిర్దేశం!
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ సమన్వయకర్తలతో బుధవారం సమావేశం కానున్నారు. భేటీలో 175 అసెంబ్లీ.. 25 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలు పాల్గొంటారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాను బలంగా వినియోగించుకోవడం.. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం లక్ష్యంగా జగన్ దిశానిర్దేశం చేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా రావాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే బుధవారం శాసన మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ జరుగనుంది. దీంతో ఈ భేటీకి ఎమ్మెల్సీలకు మినహాయింపు ఇచ్చారు.