పిల్లాడిలా మారాం చేస్తున్న జగన్: రఘురామ
ABN , Publish Date - Sep 06 , 2025 | 06:42 AM
చందమామ కోసం చంటి పిల్లాడు మారాం చేసినట్లు ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాం చేస్తున్నాడని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు.
కాళ్ల, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): చందమామ కోసం చంటి పిల్లాడు మారాం చేసినట్లు ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాం చేస్తున్నాడని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘18 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అర్హత పొందుతారనే విషయం తెలిసి కూడా హోదా కావాలనడం విడ్డూరంగా ఉంది. శాసనసభకు రానంటూ జగన్ మారాం చేస్తే పులివెందులకు కూడా బైఎలక్షన్ వస్తుంది’ అని రాఘరామరాజు అన్నారు.