బాబుపై అక్కసుతో జగన్ కట్టుకథలు: కలిశెట్టి
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:02 AM
లిక్కర్ కుంభకోణంలో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): లిక్కర్ కుంభకోణంలో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. అధికారం పోయాక రోజురోజూకి జగన్ మానసిక పరిస్థితి దిగజారుతున్నట్లు అర్థమవుతుందన్నారు. నెల్లూరు పర్యటనలో జగన్ మాట్లాడిన తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబుకు మధ్య గొడవలను దగ్గరుండి చూసినట్లు జగన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దేశ రాజకీయాలలో ప్రత్యేకస్థానం ఉందని, దేశవ్యాప్తంగా ఆయనకు దక్కుతున్న గౌరవాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని చెప్పారు. నెల్లూరు పర్యటనలో పోలీసుల మానసిక ధైర్యం దెబ్బతిసేలా జగన్ వ్యవహార శైలి ఉందని ఎంపీ విమర్శించారు.