Share News

Ambedkar Jayanti: తాడేపల్లిలో అంబేడ్కర్‌ జయంతికి జగన్‌ డుమ్మా

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:20 AM

తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో జరిగిన అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమానికి జగన్ హాజరుకాలేదు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్ర పోరాటాలకు పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

Ambedkar Jayanti: తాడేపల్లిలో అంబేడ్కర్‌ జయంతికి జగన్‌ డుమ్మా

అమరావతి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి హాజరుకాలేదు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్‌, మేరుగ నాగార్జున, టీజేఆర్‌ సుధాకరబాబు, అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో చెవిరెడ్డి భాస్కర రెడ్డి సమావేశమయ్యారు. త్వరలోనే పార్టీ రాష్ట్ర కమిటీలను నియమించాల్సి ఉందని వెల్లడించారు. అనంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృత పోరాటాలు చేయాల్సి ఉందని పార్టీ నేతలకు చెవిరెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:20 AM