Share News

జగన్‌ తప్పు తెలుసుకో... లెంపలేసుకో: లంకా దినకర్‌

ABN , Publish Date - Oct 24 , 2025 | 04:32 AM

ప్రతిపక్ష నేత జగన్‌ అబద్ధాలను నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ మండిపడ్డారు.

జగన్‌ తప్పు తెలుసుకో... లెంపలేసుకో: లంకా దినకర్‌

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష నేత జగన్‌ అబద్ధాలను నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ మండిపడ్డారు. ‘ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు ఊరికేరావు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయనే విషయాన్ని జగన్‌ తెలుసుకోవాలి. పెట్టుబడులపై జగన్‌.. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేవలం రూ.8వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అదీ గతంలో స్థాపించిన కంపెనీలను విస్తరించడానికి మాత్రమే వచ్చాయి. కూటమి పాలనలో రూ.11 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు రాబట్టడంలో విఫలమైన జగన్‌... ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని లెంపలేసుకోవాలి’ అని దినకర్‌ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో సభ్యుడి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు’ అని దినకర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Oct 24 , 2025 | 04:32 AM