Share News

Neelayapalem Vijayakumar: మామిడి ఎందుకు కొనడం లేదో మీ నేతల ఫ్యాక్టరీలకు వెళ్లి అడగండి

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:51 AM

మామిడికి మార్కెట్‌లో డిమాండు ఎందుకు తగ్గిందో జగన్‌ పార్టీకి చెందిన మ్యాంగో పరిశ్రమలకు వెళ్లి తెలుసుకోవాలని బయోడైవర్సిటీ బోర్డు చైౖర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ సలహా ఇచ్చారు.

Neelayapalem Vijayakumar: మామిడి ఎందుకు కొనడం లేదో మీ నేతల ఫ్యాక్టరీలకు వెళ్లి అడగండి

  • జగన్‌ వెళ్తోంది పరామర్శకా? దండయాత్రకా: నీలాయపాలెం

తిరుపతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): మామిడికి మార్కెట్‌లో డిమాండు ఎందుకు తగ్గిందో జగన్‌ పార్టీకి చెందిన మ్యాంగో పరిశ్రమలకు వెళ్లి తెలుసుకోవాలని బయోడైవర్సిటీ బోర్డు చైౖర్మన్‌ నీలాయపాలెం విజయకుమార్‌ సలహా ఇచ్చారు. తిరుపతిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ మామిడి రైతుల పరామర్శకు వస్తున్నారా? దండయాత్రకు వస్తున్నారా? అర్థం కావడంలేదు. ఆయన పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ ఫుడ్స్‌, వైసీపీ నేతలకు సంబంధించిన సీజీఆర్‌ ఫుడ్స్‌, టాస్‌ తదితర పరిశ్రమలు మామిడి పండ్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అడగాలి’ అని సూచించారు.

Updated Date - Jul 09 , 2025 | 05:52 AM