YS Jagan: హాజరు నుంచి మినహాయించండి
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:21 AM
అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ప్రత్యక్ష హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ నాంపల్లి...
అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను
స్వయంగా వస్తే భారంగా మారనున్న భద్రతా ఏర్పాట్లు
సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): అక్రమ ఆస్తుల కేసులో విచారణ నిమిత్తం ప్రత్యక్ష హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని తెలిపారు. యూరప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నవంబర్ 14 లోపు ప్రత్యక్షంగా తమ ఎదుట హాజరుకావాలని ఇటీవల సీబీఐ కోర్టు జగన్‌కు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. తప్పనిసరి అనుకుంటే స్వయంగా వస్తానని పేర్కొన్నారు. తాను స్వయంగా వస్తే భద్రత ఏర్పాట్లు భారంగా మారుతాయని తెలిపారు. జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.