Share News

జగన్‌ హయాంలో అన్నీ కుప్పకూలాయి: యనమల

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:07 AM

జగన్‌ హయాంలో పాలనతోపాటు ఆర్థికం, వ్యవసాయం, తయారీ, పర్యాటకం తదితర అన్ని రంగాలూ కుప్పకూలాయని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.

జగన్‌ హయాంలో అన్నీ కుప్పకూలాయి: యనమల

అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జగన్‌ హయాంలో పాలనతోపాటు ఆర్థికం, వ్యవసాయం, తయారీ, పర్యాటకం తదితర అన్ని రంగాలూ కుప్పకూలాయని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్‌ పాలనలో నిరుద్యోగం పెరిగి, పేదల ఆదాయాలు తగ్గాయని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే పెట్టుబడులు పెట్టొద్దంటూ లేఖలు రాయడం జగన్‌ కుట్రపూరిత నైజానికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్ర ఆర్థికవ్యవస్థ వేగంగా కోలుకుంటే ఆదాయం పెరిగి, పేదలకు సంక్షేమం అందుతుందని, ఇది జరగడం జగన్‌కు ఇష్టం లేదని చెప్పారు.

Updated Date - Aug 26 , 2025 | 06:08 AM