Share News

Minister Anam Ramanarayana Reddy: జగన్‌తో శాంతిభద్రతలకు విఘాతం

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:44 AM

ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Minister Anam Ramanarayana Reddy: జగన్‌తో శాంతిభద్రతలకు విఘాతం

  • వైసీపీ హయాంలో హిందూ సంస్కృతి నాశనం: మంత్రి ఆనం

బనగానపల్లె, జూలై 30(ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైపీపీ ప్రభుత్వ హయాంలో ఖనిజ సంపదను దోచుకున్న వ్యక్తులు, రౌడీలు, గూండాలు, దొంగల పరామర్శ పేరుతో జగన్‌ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఖనిజ సంపదను దోచుకున్న దొంగలు జైల్లో ఉంటే వారిని పరామర్శించేందుకు రావడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆశీస్సులతో సుపరిపాలన అందిస్తోంది. వైసీపీ హయాంలో రామతీర్థంలో రాముని తల పగులగొట్టడం, అంతర్వేది రథం తగలబెట్టడం, దుర్గమ్మ వెండి సింహాల చోరీ, వెంకటేశ్వర స్వామి రథం తగలబెట్టిన ఘటనలపై తిరిగి విచారణ చేస్తున్నాం’ అని మంత్రి ఆనం తెలిపారు.

Updated Date - Jul 31 , 2025 | 06:45 AM