Share News

జగన్‌వి దిగజారుడు వ్యాఖ్యలు: పార్థసారథి

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:31 AM

సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ కావడం సహించలేక సీఎం చంద్రబాబుపై జగన్‌ అతి జుగుప్సాకరమైన, దిగజారుడువ్యాఖ్యలు చేశారని రాష్ట్ర పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు.

జగన్‌వి దిగజారుడు వ్యాఖ్యలు: పార్థసారథి

అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ కావడం సహించలేక సీఎం చంద్రబాబుపై జగన్‌ అతి జుగుప్సాకరమైన, దిగజారుడువ్యాఖ్యలు చేశారని రాష్ట్ర పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. ఇక అధికారంలోకి రాలేమనే అక్కసుతో జగన్‌ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్‌ పత్రికలో రాస్తున్న కథనాల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా జగన్‌ బెదిరిస్తున్నారని మంత్రి టీజీ భరత్‌ మండిపడ్డారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించి తీరుతామన్నారు. జగన్‌ పత్రిక, చానల్‌ను బ్లాక్‌ లిస్ట్‌ చేస్తే తప్ప రాష్ట్రానికి మంచి జరగదని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - Sep 12 , 2025 | 05:32 AM